NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: ఓజీ.. ఓజీ కాదు.. శ్రీశ్రీ.. శ్రీశ్రీ.. అనండి..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: పవన్‌ స్టార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎక్కడికి వెళ్లినా.. ఓజీ.. ఓజీ అంటూ ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు.. అయితే, వాళ్లకు ఎప్పటికప్పుడు కౌంటర్‌ ఇస్తూ వస్తున్నారు పవన్‌.. తనను పని చేసుకోనివ్వండి అని గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.. ఇక, ఈ రోజు విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మరోసారి అదే అనుభవం ఎదురైంది.. పవన్ స్పీచ్ సమయంలో OG.. OG.. అంటూ నినాదాలు చేశారు అభిమానులు.. అయితే.. OG.. OG.. కంటే శ్రీశ్రీ.. శ్రీశ్రీ అనండి అని వారికి సలహా ఇచ్చారు పవన్‌.. నేను మీకు ప్రాణం అయ్యే స్థాయికి వచ్చను అంటే పుస్తకాల ప్రభావమే కారణమన్న ఆయన.. యూత్ అంతా పుస్తక పఠనం అలవాటు చేసుకోండి అని సలహా ఇచ్చారు.. పుస్తకం ద్వారా వచ్చే శక్తి జ్ఞానం వేరు.. చీకటిలో ఉనప్పుడు పుస్తకం ఓ దారి చూపిస్తుందన్నారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఇక, తెలుగు అధ్యాపకులు బలమైన జీతాలు ఉండాలని ఆకాక్షించారు డిప్యూటీ సీఎం పవన్‌.. నేను బయటికి వచ్చినా పుస్తకాలు నా పక్కనే ఉండాలి.. చేతిలో పుస్తకం ఉంటే ఆ ధైర్యమే వేరన్నారు.. తొలిప్రేమ సినిమాలు వచ్చిన 15 లక్షల డబ్బుల్లో లక్ష పెట్టి పుస్తకాలు కొనుకున్నాను.. కొన్నవన్నీ రూమ్ లో వేసుకుని మూడు రోజులు చదివేశా.. మన జీవితకాలంలో అందరూ పది వేల పుస్తకాలు చదవాలని సూచించారు.. అంతేకాదు.. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అన్నారు పవన్ కళ్యాణ్.. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని తెలిపారు.

Read Also: Indian Snakeroot: ఈ ఒక్క మొక్క పెంచండి.. మీ ఇంటి పరిసరాల్లో పాములు అస్సలు రావు..

మరోవైపు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సాహితీ వేత్తగా, రచయితగా మహోన్నతులు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. పీవీ గురించి మాట్లాడే అంత జ్ఞానం తనకు లేదని చెప్పారు. తనకు అంత జ్ఞానం వచ్చాక మాట్లాడతానని అన్నారు. ఢిల్లీలో పీవీకి సరిగ్గా ఖనన కార్యక్రమం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీకి నివాళి అర్పించడానికి ఢిల్లీలో సమాధి లేదని అన్నారు. లక్షల మంది ముందుకు వచ్చి ఢిల్లీలో స్మృతి వనం ఏర్పాటు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వనవాసి, అక్షర సత్యామృతం, ఏది పాపం, నానీపాల్కే వూది‌ పీపుల్ ఇలా ఎన్నో పుస్తకాలు తాను చదివిన వాటిలో ఉన్నాయని తెలిపారు. ఇక నుంచి తన ట్విట్టర్‌లో అప్పుడప్పుడు పుస్తకాలపై పోస్ట్ పెడతానని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఓజీ ఓజీ అంటూ అభిమానుల నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఓజీ అనే కన్నా శ్రీశ్రీ అంటే బాగుంటుందని పవన్ కల్యాణ్ చమత్కరించారు.

Show comments