NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: పర్యావరణ పరిరక్షణపై వర్క్ షాప్.. డిప్యూటీ సీఎం పవన్‌ కీలక వ్యాఖ్యలు

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: విజయవాడలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై నిర్వహించి వర్క్‌ షాప్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సాగింది.. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. పర్యావరణ పరిరక్షణ కు నిపుణులు, మేధావులు, ఎన్జీవోల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి అన్నారు.. ఈ వర్క్‌షాపు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ రెండు అంశాలపై వేసే అడుగులపై అందరికీ స్పష్టత వస్తుందన్నారు.. ఈ ఐదేళ్ల కాలంలో ఎంతవరకు కాలుష్యాన్ని నియంత్రించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాం.. పీసీబీ ఛైర్మన్ కు నా ఆలోచన చెప్పిన వెంటనే.. ఈ వర్కుషాపును ఏర్పాటు చేశారని తెలిపారు.

Read Also: RRB NTPC: దరఖాస్తు చివరి తేదీని పొడిగించిన ఆర్ఆర్‭బి

ఇక, అన్ని రంగాల నిపుణులు, ఎన్జీవోలను ఆహ్వానించడం అభినందనీయం అన్నారు పవన్‌కల్యాణ్‌.. నేను పర్యావరణ ప్రేమికుడిని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని.. ప్రకృతి ప్రేమికులు ఎంత తపన పడతారో నాకు తెలుసు.. భూమి మీద కనీస బాధ్యత లేకుండా మనం జీవనం సాగిస్తున్నాం.. భూమిని మనం సొంతం చేసుకోవడం కాదు.. భూమే ఏదొకనాటికి మనలను సొంతంచేసుకుంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది.. దానిని అభివృద్ది చేయాలి.. పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలి.. భవిష్యత్ తరాల కోసం.. మనమంతా ఇప్పుటి నుంచే ఆలోచన చేయాలి అన్నారు.. జల, వాయి కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. ఈ వర్కుషాపుకు వచ్చిన నిపుణులు సలహాలతో సమాజానికి మరింత మేలు జరగాలనేది నా ఆకాంక్షగా పేర్కొన్నారు..

Read Also: Threat Of Hurricane: భయం గుప్పిట్లో ఫ్లోరిడా.. మరోమారు హరికేన్ హెచ్చరికలు జారీ

మీ అనుభవం, మీ మేధస్సు ఈ రాష్ట్ర అభివృద్దికి ఉపయోగపడాలి.. విపరీతంగా కాలుష్యం పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుందన్నారు పవన్‌ కల్యాణ్‌.. కాలుష్య కోరల నుంచి సమాజాన్ని రక్షించడంలో మీరంతా పాత్రధారులు కావాలి.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే.. పరిశ్రమల యాజమాన్యాలలో అపోహలు ఉన్నాయి.. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడతారనే అపప్రద పీసీబీపై ఉంది.. దీంతో ఆతర్వాత పాలకులు పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యాన్ని పట్టించుకోవడం మానేశారు.. ఇక నుంచి పరిశ్రమల ఏర్పాటు, కాలుష్యం నివారణ రెండు అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం అన్నారు.. మీ అమూల్యమైన సలహాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Show comments