NTV Telugu Site icon

Indrakiladri: వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దుర్గమ్మ దర్శనానికి రావాలి..

Vja Durga

Vja Durga

Indrakiladri: విజయవాడ కనకదుర్గ ఆలయంలో గత రెండు రోజుల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనేదే మా ఉద్ధేశం.. వీఐపీ భక్తులు టైమ్ స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలని కోరుతున్నాం.. ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం.. రేపట్నుంచి రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెల్లడించారు.

Read Also: Bangladesh: ఢాకాలో వేలసంఖ్యలో హిందువుల నిరసన.. ప్రభుత్వానికి 8 డిమాండ్లు..

ఇక, సామాన్య భక్తులకు మంచి దర్శనం కల్పించాలనేదే మా లక్ష్యం అని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. వీఐపీలకు కొంత అసౌకర్యం కలిగినా అర్ధం చేసుకోవాలి.. వీఐపీలు టైమ్ స్లాట్ ప్రకారమే వస్తే మంచి దర్శనం జరుగుతుంది.. 500 రూపాయల దర్శనం ఆలస్యమవుతోంది.. 300 రూపాయల క్యూలైన్ దర్శనం త్వరితగతిన జరుగుతోంది.. క్యూలైన్లలో పద్ధతి పాటించకుండా ప్రవేశించే భక్తులను నియంత్రిస్తున్నాం అని ఆయన చెప్పారు. పోలీస్ యూనిఫామ్ లో ఎవరు దర్శనానికి వెళ్లినా ఊరుకునేది లేదని హెచ్చరించాం.. వీఐపీ దర్శనాలకు యాప్ అందుబాటులోకి తెచ్చాం.. ట్రాఫిక్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. అస్ర్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నాం.. సైబర్ క్రైమ్ పై అవేర్ నెస్ కార్యక్రమం చేపట్టాం.. నిన్నటికి లక్ష మందిని యాప్ లో సైబర్ అవేర్ నెస్ కల్పిస్తున్నాం.. మూలానక్షత్రం రోజున మరింత పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నాం.. చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి.. వాటిని పరిష్కరిస్తున్నామని సీపీ రాజశేఖర్ బాబు అన్నారు.

Read Also: Rajendra Prasad : ‘నా కూతురుతో మాట్లాడను’.. వైరల్ అవుతున్న రాజేంద్ర ప్రసాద్‌ పాత వీడియో..!

కాగా, తొలిరోజు అమ్మవారిని 49 వేల మంది దర్శించుకున్నారు అని కనకదుర్గ ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. రెండవ రోజు అమ్మవారిని 65 వేల మంది దర్శించుకున్నారు.. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకూ 36 వేల మంది దర్శించుకున్నారని పేర్కొన్నారు. మూలానక్షత్రం రోజు భారీగా భక్తులు తరలి వస్తారు.. రెండు రోజుల్లో 28 వేల మంది అన్నదానంలో అన్నప్రసాదం స్వీకరించారు.. 3,952 మంది కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించారు.. లక్షా 39 వేల 906 లడ్డూలు కొనుగోలు చేశారు.. లక్షన్నరకు పైగా లడ్డూలు రెడీగా ఉన్నాయి.. 6 లడ్డూలు కలిపి ఒక ప్యాకింగ్ రూపంలో అందిస్తున్నాం.. లడ్డూ ప్రసాదం కొరత లేకుండా చూస్తున్నామని ఈవో రామారావు వెల్లడించారు.