Site icon NTV Telugu

Kadambari Jethwani case: ముంబై హీరోయిన్ కేసు.. కాంతిరాణా టాటా, విశాల్ గున్నీకి సీఐడీ నోటీసులు..

Ci

Ci

Kadambari Jatwani Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.. నేడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.. దీంతో, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు ఈ రోజు సీఐడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఇప్పటికే జెత్వానీ కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్ చేసిన విషయం విదితమే.. మరోవైపు, ఈ కేసులో పాత్రధారులుగా ఉన్న కాంతిరాణా, విశాల్ గున్నీలను విచారణ చేయాలని సీఐడీ నిర్ణయానికి వచ్చింది.. అందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది..

Read Also: Aadi Srinivas: గల్ఫ్ లో మంచి ఆఫర్ ఉందంటూ.. ఎమ్మెల్యేకు మహిళ ఫోన్.. చివరకు

కాగా, ముంబై నటి జెత్వానీ కేసు విషానికి వస్తే.. నటి కాదంబరి జెత్వానీని కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు విద్యాసాగర్ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయడం.. అరెస్ట్‌ల వరకు వెళ్లింది.. అంతేకాదు.. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం సంచలనం సృష్టించింది.. ఈ కేసులో, కొంతమంది పోలీసు అధికారులు మరియు రాజకీయ నాయకులు.. నటి కాదంబరి జెత్వానీ మరియు ఆమె కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని.. వారిని వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి..

Exit mobile version