Chevireddy Bhaskar Reddy: విజయవాడలో కోర్టు వద్ద మరోసారి హల్‌చల్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఏపీ మద్యం స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయన.. అప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చిన ప్రతీసారి.. ఏదో హల్ చల్ చేస్తూ వస్తున్నారు.. అయితే, తాను ఏ తప్పు చేయకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. మీడియాలో కూడా ఇష్ట రీతిన అసత్య వార్తలు రాస్తున్నారని.. వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు చెవిరెడ్డి.. తానెప్పుడూ మద్యం వ్యాపారం చేయలేదని.. మద్యం నుంచి ఒక్క రూపాయి ఆదాయం కూడా ఆశించలేదని.. ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.. “మనసా వాచా కర్మణా” లిక్కర్ జోలికి ఎప్పుడు పోలేదు.. లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదని పేర్కొన్నారు.
Read Also: Arjun Tendulkar: ఎంగేజ్‌మెంట్ అనంతరం మొదటి మ్యాచ్.. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన అర్జున్!
నేను ఏడో తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది.. ఇదే తాగుడు వళ్ల మా నాన్న చనిపోయాడు.. తాడుగుతోనే మా తమ్ముడు చనిపోయాడు.. దాంతో.. నేను లిక్కర్‌ను ధ్వేషిస్తాను.. లిక్కర్ జోలికి పోను అన్నారు చెవిరెడ్డి.. చిన్నప్పటి నుంచి ఇది ఉద్దేశంతో ఉన్నాను.. లిక్కర్ ని ద్వేషించే నన్ను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం నాకు బాధేసింన్నారు.. పత్రికల్లో విచచక్షణారహితంగా అసత్యాలు రాస్తున్నారు..10 శాతం తప్పు చేస్తే 90 శాతం యాడ్ చేయండి.. కానీ, 100 శాతం యాడ్ చేయొద్దు అని సూచించారు.. మనసుకు బాధ వేస్తుంది.. అరెస్టు చేసినందుకు బాధ లేదు.. లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినందుకు బాదేస్తుందన్నారు.. 13 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్న.. 160 మంది పిల్లలు చదువుతున్నారు. తాగుడు వ్యాపారం చేస్తే నైతికగా హక్కు కోల్పోతాం.. ఇది ధర్మం కూడా కాదన్నారు. ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం చేయాలి. నేను వ్యాపారం చేసుకుంటున్నాను.. లిక్కర్ తో సంబంధం ఉండి.. పెట్టుబడి పెట్టినా.. ఆస్తులు అటాచ్‌మెంట్ కాదు స్వాధీనం చేసుకోండి అని సవాల్ చేశారు.. కానీ, లిక్కర్ తో సంబంధం లేకుండా మా వ్యాపారం మీద, మా కొడుకు మీద పడుతున్నారు.. ఇది న్యాయం కాదు.. దేవుడు ఉన్నాడు అన్నారు.. అయితే, ఏ తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తున్నాను అన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి..
