గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. వివిధ కేసుల్లో ఆయన 138 రోజులుగా విజయవాడ సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అన్ని కేసుల్లో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. చివరిగా మంగళవారం నకిలీ పట్టాల కేసులో కూడా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అయింది.
ఇది కూడా చదవండి: KajolDevgan : గోల్డెన్ శారీలో దగదగ మెరుస్తున్న కాజోల్
బుధవారం వంశీ జైలు నుంచి విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు. ఫిబ్రవరి 13 నుంచి విజయవాడ సబ్ జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు జైలుకు తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Venkat : టాలీవుడ్ నటుడి ఆరోగ్యం విషమం.. సాయం కోసం వేడుకుంటున్న భార్య..
