AP Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన నకిలీ మద్యం కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్‌తో పాటు సహా మిగిలిన నిందితులకు షాక్ తగిలింది.. నకిలీ మద్యం కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్, జోగి రాము సహా మిగిలిన నిందితులకు ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.. దీంతో, నిందితులకు జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత నిందితులను జిల్లా జైలుకు తరలించారు అధికారులు.. మరోవైపు, ఇదే కేసులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు జోగి రమేష్.. ఇప్పటికే రెండుసార్లు జోగి రమేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం.. ఆ పిటిషన్‌ను ఎక్సైజ్ కోర్టు డిస్మిస్ చేయడం జరిగిపోగా.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యరు జోగి రమేష్, జోగి రాము..
Read Also: New Year Songs: న్యూ ఇయర్ పార్టీ కోసం.. 2025లో ట్రెండ్ సెట్ చేసిన టాప్ 5 సాంగ్స్
