Ayesha Meera Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులోకీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ నివేదిక తమకు ఇవ్వటం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయేషా మీరా పేరెంట్స్ పిటిషన్ వేయగా విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 10వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయినా సీబీఐ నివేదిక ఇవ్వకపోవడంతో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు ఆయేషా మీరా తల్లిదండ్రులు.. దీంతో, విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఈ నెల 31వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ.. విచారణ వాయిదా వేసింది. కాగా, ఆయేషా మీరా హత్య కేసు పై సీబీఐ నమోదు చేసిన రెండు FIRలు, DNA నమూనాలు, సాక్షుల స్టేట్‌మెంట్లు అన్నీ ఇస్తేనే అభ్యంతరాలు వ్యక్తం చేయగలమని కోర్టుకు తెలిపారు ఆయేషా మీరా పేరెంట్స్.. సాక్ష్యాల ధ్వంసంపై నమోదైన FIR తమకు సంబంధం లేదని సీబీఐ చెబుతున్నట్టు కోర్టుకు తెలిపారు ఆయేషా మీరా తరఫు లాయర్..
Read Also: అనకాపల్లి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం…
