Site icon NTV Telugu

AP Liquor Scam Case: ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు ఎప్పుడంటే..?

Mithun Reddy

Mithun Reddy

AP Liquor Scam Case: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి.. ఇక, ఈ నెల 12వ తేదీన మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని.. ఇప్పటికే అరెస్ట్‌ చేసింది సిట్‌.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి..

Read Also: Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు

అయితే, ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి.. మిథున్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. మిథున్ రెడ్డి కాల్ రికార్డ్స్ లో చెవిరెడ్డి, కేసిరెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మాట్లాడినట్టు ఉన్నట్టు సిట్ చెబుతోంది.. వారంతా ఒకే పార్టీలో ఉన్నపుడు మాట్లాడితే కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు.. వందల మంది స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసి కేవలం LW – 13, 14, 71 ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బెయిల్ ఇవ్వద్దని చెప్పటం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మిథున్‌రెడ్డి న్యాయవాదులు..

Read Also: PVN Madhav: రాజధాని అమరావతిపై బీజేపీ ఏపీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక, కోర్టులో సిట్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వవొద్దని పేర్కొన్నారు.. మిథున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వ హయాంలో పలుకుబడి కలిగిన వ్యక్తులని పేర్కొంది సిట్‌.. ఆ పలుకుబడితో డిస్టలరీస్ నుంచి డబ్బులు వసూలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సిట్‌ న్యాయవాదులు.. మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అని కోర్టులో వాదనలు వినిపించారు సిట్‌ తరపు న్యాయవాదులు.. అయితే, ఇరు వర్గాల వాదనలు ముగించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 12వ తేదీన మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది.

Exit mobile version