Mahesh Chandra Laddha: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌తో కలకలం రేగింది.. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగా మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు.. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ హిడ్మా, ఆయన భార్య హేమ, మరో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు.. ఇక, మావోయిస్టుల ఎన్‌కౌంటర్, ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్ట్‌లపై విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటిలిజెన్స్ ADG మహేష్ చంద్ర లడ్డా.. కీలక విషయాలను వెల్లడించారు..
Read Also: Maoist Encounter in AP: ఏపీలో మరో ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలపై గత రెండు నెలలుగా కచ్చితమైన నిఘా కొనసాగుతోందని, ఇటీవల జరిగిన సమన్వయ ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో మద్దతు నెట్‌వర్క్ కూలిపోయిందని ఏపీ ఇంటెలిజెన్స్ ADG మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించడంతో, ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో మావోయిస్టు నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఇక, ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం.. మావోయిస్టు చరిత్రలోనే ఇది పెద్ద ఘటనగా పేర్కొన్నారు.. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్వహించిన శోధనల్లో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని లడ్డా చెప్పారు.
Read Also: TSPSC Group-2: సంచలనం.. పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షను రద్దు చేసిన హైకోర్టు..
అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే అని ఆయన వివరించారు లడ్డూ.. ఏపీలో ప్రస్తుతం మావోయిస్టుల రిక్రూట్‌మెంట్ పూర్తిగా ఆగిపోయిందని, కొంతమంది వారికి సహకరిస్తున్న సానుభూతిపరులను కూడా గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే, మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్‌జీ ఎక్కడ ఉన్నాడన్న విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదని లడ్డా చెప్పారు. అతను ఛత్తీస్‌గఢ్ లేదా తెలంగాణ ప్రాంతంలో దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసినవారు దేవ్‌జీ ప్రొటెక్షన్ టీమ్‌లో భాగమని పేర్కొన్నారు. ఇక, ఏపీలో జరిగిందిది జాయింట్ ఆపరేషన్ కాదు అని క్లారిటీ ఇచ్చారు.. నిన్న జరిగిన ఆపరేషన్ పూర్తిగా ఏపీ పోలీసులే నిర్వహించారని, ఇది ఏ ఇతర రాష్ట్రంతో కలిపి చేసిన ఆపరేషన్ కాదని ఆయన స్పష్టం చేశారు.
మావోయిస్టుల చరిత్రలో మొదటి సంఘటన
ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ కావడం, టాప్ కమాండర్ల మరణం.. ఇది మావోయిస్టుల చరిత్రలో అరుదైన సంఘటనగా పేర్కొన్నారు లడ్డా.. కేంద్ర హోం మంత్రి విధించిన లక్ష్యాల మేరకు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ADG నమ్మకం వ్యక్తం చేశారు. ఏపీలో మావోయిస్టులు ఇప్పుడు లేరు.. ఉన్నవారిని అరెస్ట్ చేశామని వెల్లడించారు మహేష్ చంద్ర లడ్డా..
