NTV Telugu Site icon

Boycott Swiggy in AP: బాయ్‌కాట్‌ స్విగ్గీ..! హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం

Boycott Swiggy

Boycott Swiggy

Boycott Swiggy in AP: ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌పై ఆధారపడుతున్నారు.. నచ్చిన రెస్టారెంట్‌ నుంచి.. మెచ్చిన ఫుడ్‌ అలా ఆర్డర్‌ చేసి.. ఇలా నిమిషాల్లో అందుకుంటున్నారు.. అయితే, దీని వెనుక పెద్ద ప్రాససే ఉంటుంది.. ఇప్పుడు హోటల్స్‌ అసోసియేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం నిర్ణయించింది.. విజయవాడలో సమావేశమైన హోటల్స్‌ యాజమాన్యాలు.. స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు.. అయితే, నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్స్‌, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు నిలివేశామని ప్రకటించారు.. రాష్ట్రంలోని అన్ని హోటల్స్ లో స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం అంటూ స్పష్టం చేశారు..

Read Also: Minister Tummala: మరో 20 లక్షల మందికి త్వరలోనే రుణమాఫీ..

ఇక, స్విగ్గీ, జొమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది హోటల్స్ అసోసియేషన్.. ఆగష్టు 12, 27, సెప్టెంబర్ 27న మూడు దఫాలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చించాం.. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించింది.. కానీ, స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తుందని మండిపడ్డారు.. దీంతో, అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం.. వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయంపై చర్చించామన్నారు.. ఇక, తప్పనిసరి పరిస్థితుల్లో ఈనెల 14వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్ కాట్ చేస్తున్నాం అని ప్రకటించారు.. అయితే, స్విగ్గీ, జొమాటోకు సహకరించేందుకు మేం సిద్దంగానే ఉన్నాం.. కానీ, నియమ నిబంధనల్లో మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు.. క్రేజీ ప్యాకేజీల పేరుతో తయారైన ఆహారం కంటే తక్కువ ధరకు విక్రయాలతో మేం నష్టపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు.

Show comments