Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: శాంతి వచనాలు పని చేయవు.. పాకిస్తాన్‌లో ఇళ్లలోకి దూరెళ్లి కొడతాం..!

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: పాకిస్తాన్‌ విషయంలో శాంతి వచనాలు పని చేయవు.. పాకిస్తాన్‌లో ఇళ్లలోకి దూరెళ్లి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. విజయవాడలో నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్నారు పవన్‌.. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు జరిగిన ఈ ర్యాలీతో త్రివిధ దళాలకు మద్దతు తెలిపింది కూటమి ప్రభుత్వం.. జాతీయ జెండాలు చేతబట్టి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు ఏపీ మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. తిరంగా యాత్రకు విజయవాడలో మద్దతు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు.. దేశ విభజన జరిగినప్పటి నుంచి ప్రశాంతత చూడలేదు.. అభివృద్ధి చెందుతున్న మన దేశాన్ని వెనక్కి నెట్టాలనే ప్రయత్నాలు చూశాం అన్నారు.

Read Also: Jammu Kashmir: పాక్‌ని పట్టించుకునేదే లేదు.. రెండు ప్రాజెక్టుల పనుల వేగం పెంచండి..

కసబ్ లాంటి వారు 72 గంటలు ఎలాంటి దాడులు చేశారు తెలుసు.. గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్, జామా మసీదు పేలుళ్లలో ఉగ్రవాదుల హస్తం ఉన్న ఘటనలు చూశామన్నారు పవన్‌ కల్యాణ్.. జమ్ము కశ్మీర్, రాజస్థాన్, హర్యానాలలో మనకు ఉన్నంత ప్రశాంతత ఉండదు.. అనునిత్యం సైనికులు మనల్ని కాపాడుతున్నారు.. అందుకే సైనికులకు మన ఉన్నాం అనే ధైర్యం ఇవ్వాలన్నారు.. సెక్యులరిజం పేరిట సూడో సెక్యులరిస్టులు వ్యాఖ్యలు చేస్తే.. ఏ స్ధాయి వ్యక్తులైనా సమాధానం చెప్పాలన్నారు పవన్.. ఇక, మురళీ నాయక్ భారత్ మాతాకీ జై అని మాత్రమే చెప్పాడు.. అంటూ.. వీరజవాన్‌ మురళీనాయక్‌కు నివాళులర్పించారు.. సినిమాలు రావచ్చు‌. పోవచ్చు… బాలీవుట్, టాలీవుడ్ హీరోలు మాట్లాడటం లేదంటే.. వాళ్లు జస్ట్ ఎంటర్‌టైనర్స్ మాత్రమే అని వ్యాఖ్యానించారు.. సెలబ్రిటీల నుంచి దేశభక్తి ఆశించవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలి‌.. ప్రధాని మోడీకి మద్దతుగా ఉంటామని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

Exit mobile version