Adulterated Liquor Case: నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో.. జోగి రమేష్ చెబితేనే..!
- నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో..
- కీలక విషయాలు బయటపెట్టిన నిందితుడు జనార్ధన్ రావు..
- వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ..
- టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో ఆపేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adulterated Liquor Case: ఓవైపు లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు.. నకిలీ మద్యం కేసులో ఏపీలో కలకలం రేపింది.. ఇప్పుడు ఈ కేసులో సంచలన వీడియో బయటకు వచ్చింది.. ఈ వీడియోలు కీలక విషయాలు బయటపెట్టారు నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్ధన్ రావు.. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు అంగీకరించారు జనార్ధన్ రావు.. అయితే, టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశామని పేర్కొన్నాడు.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చెయ్యాలని చెప్పారని.. టీడీపీ ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించడానికి మళ్లీ నువ్వు నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాలని జోగి రమేష్ నాతో అన్నారు అని వెల్లడించారు.. పై వారి ఆదేశాలతోనే నాకు నమ్మకస్తుడు అయిన నీకు ఈ పని అప్పజెప్పుతున్నాను. నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేష్ నాతో అన్నారని.. ఇబ్రహీంపట్నంలో పెట్టాలి అనుకున్నా.. కానీ, జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాం అని వీడియోలో వెల్లడించారు..
Read Also: SIT on Adulterated Liquor Case: నకిలీ మద్యం కేసుపై సర్కార్‌పై కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
తంబళ్లపల్లె నియోజకవర్గంలో లిక్కర్ షాపులు నేను తీసుకున్నా.. తంబళ్లపల్లె నుండి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చు అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేష్ అన్నారని వీడియోలో చెప్పుకొచ్చాడు జనార్దన్ రావు.. వేరే వాళ్ల పేరు మీద రూమ్ అద్దెకు తీసుకొని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్ని తీసుకొచ్చాం. లిక్కర్ తయారీ చెయ్యండి. మంచి సమయం చూసి మీరు ఎవరూ లేనప్పుడు దానిని ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి రమేష్ నాతో అన్నారు. నీకు ఉన్న ఆర్ధిక ఇబ్బందులు నుండి బయటపడటానికి సహాయం చేస్తామని జోగి రమేష్ హామీ ఇచ్చారు.. అంతా రెడీ అయ్యిన తరువాత నన్ను ఆఫ్రికాలో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరకు పంపారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా డిపార్ట్మెంట్ కు లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు అంటూ ఆసక్తికర అంశాలు బయటపెట్టాడు..
సీఎం చంద్రబాబు.. టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు.. మన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం.. సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నారు.. ఇబ్రహీంపట్నం గోడౌన్ లో ముందు రోజే అన్ని తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ అన్నారు.. జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు అని పేర్కొన్నాడు జనార్దన్ రావు.. అనుకున్నది అంతా జరిగింది.. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది.. అంతా బాగా జరిగింది నువ్వు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నారు.. అంతా నేను చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు.. నా తమ్ముడ్ని కూడా ఇందులో జోగి రమేష్ ఇరికించాడు.. నీ ఫ్రెండ్ జై చంద్రారెడ్డి ఎలాగో ఆఫ్రికా వ్యాపారాలు చేసుకుంటున్నాడు.. అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదు అని జోగి రమేష్ నన్ను నమ్మించాడు. జై చంద్రారెడ్డి కి జరిగిన దానికి అసలు సంబంధం లేదన్నాడు… జోగి రమేష్ తో నాకు చిన్నప్పటినుండి పరిచయం.. నన్ను నమ్మించి జోగి రమేష్ మోసం చెయ్యడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నా అని సంచలన విషయాలు బయటపెట్టాడు జనార్ధన్ రావు..
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?