Site icon NTV Telugu

VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్..

Vg Venkata Reddy

Vg Venkata Reddy

VG Venkata Reddy Arrested: ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఏసీబీ అధికారులు. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయంలో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.. ఈ నెల 11వ తేదీన కేసు నమోదు చేసింది ఏసీబీ.. ఇక, హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.. హైదరాబాద్‌ నుంచి తీసుకెళ్లి ఏసీబీ కోర్టులో వెంకట రెడ్డిని హాజరు పరచనున్నారు. అయితే, అవినీతి ఆరోపణలతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం.. మరోవైపు.. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేశారాయన. వెంకటరెడ్డితో పాటు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించిన మూడు సంస్థలపై కూడా కేసులు నమోదు చేసింది ఏసీబీ. మొత్తం 7 మందిపై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసింది.. ఇందులో వెంకట రెడ్డి సహా సంస్థలపై కూడా కేసులు నమోదు చేశారు..

Read Also: Bus Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Exit mobile version