AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. నిందితుల బెయిల్ పిటిషన్ల మీద విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. దీంతో, మొత్తం ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్ల మీద ఈ నెల 24వ తారీఖున తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. అయితే, అప్పటి వరకు నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్య, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు విచారణ జరిపింది.. వాదనలు ముగిసినా.. తీర్పు 24వ తేదీ వరకు వాయిదా పడడంతో.. నిందితులకు షాక్ తగినట్లు అయ్యింది.. అయితే, 24వ తేదీన ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: Tejas Mk1A: భారత వైమానిక దళంలో చేరిన తిరుగులేని శక్తి.. తేజస్ Mk1A రాకతో శత్రువులకు చావే!
