AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీ కి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్.. అయితే, సిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. మిథున్‌రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.. మిథున్ రెడ్డిని రెండు రోజుల పాటు అంటే ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది..
Read Also: ఇక ప్రొఫిషనల్ కెమెరాలు అవసరం లేదేమో.. డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న Honor Magic V8 series?
ఇక, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రేపు అనగా సెప్టెంబర్ 19న ఉదయం 8 గంటలకు మిథున్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్నారు సిట్ అధికారులు.. రెండు రోజుల పాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఏసీబీ కోర్టు.. గతంలో ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించిన తర్వాతే సిట్ అరెస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉండగా.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు మిథున్‌రెడ్డి నుంచి లిక్కర్ స్కాం కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిద్ధమైంది సిట్ టీమ్.. కాగా, ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో ఏ-4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి.. భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ గతంలో మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఇక, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలంటూ కోర్టు షరతులు విధించగా.. ఆ మేరకు ఆయన కోర్టులో లొంగిపోయిన విషయం విదితమే..
