Site icon NTV Telugu

MP Mithun Reddy: ఎంపీ మిథన్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌.. షరతులు వర్తిస్తాయి..

Mithun Reddy

Mithun Reddy

MP Mithun Reddy: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టులో కాస్త ఊరట దక్కింది.. ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు.. ఇదే సమయంలో.. 50 వేల రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.. ఇక, ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో మళ్లీ సరెండర్‌ కావాలని షరతులు పెట్టింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం..

Read Also: Asia Cup 2025: దుబాయ్ చేరుకున్న భారత జట్టు.. హార్దిక్ పాండ్యా న్యూ లుక్ వైరల్..

కాగా, ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఏ4గా ఉన్నారు ఎంపీ మిథున్‌ రెడ్డి.. జులై 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. అయితే, ఓవైపు మధ్యంతర బెయిల్‌ కోసం ప్రయత్నం చేస్తూనే.. ఇంకో వైపు రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఎంపీ మిథున్‌రెడ్డి.. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.. 11న మళ్లీ సరెండర్‌ కావాలని ఆదేశించింది.. ఇక, మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో.. ఈ రోజు సాయంత్రం లోగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి మిథున్‌ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది..

Exit mobile version