Site icon NTV Telugu

ACB Court: ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట

Mithun Reddy

Mithun Reddy

ACB Court: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. పాస్ పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో ఏ-4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అయిన సమయంలో తన పాస్ పోర్ట్ ను కోర్టులో సమర్పించారు మిథున్ రెడ్డి.. అయితే, యూఎస్ వెళ్లేందుకు తన పాస్ పోర్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు మిథున్‌రెడ్డి.. ఇక, మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. పాస్‌పోర్ట్‌ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అయితే, దేశం విడిచి వెళ్లే సమయంలో అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది విజయవాడలోని ఏసీబీ స్పెషల్‌ కోర్టు.. దీంతో, ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట దక్కినట్టు అయ్యింది..

Read Also: Red Alert: రెడ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

కాగా, అయితే, న్యూయార్క్ లో జరగబోయే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు పీఎంవో నుంచి ఎంపికయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ నెల 27వ తేదీన నుంచి 31వ తేదీ వరకు న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. సిట్‌ సీజ్‌ చేసిన పాస్‌పోర్ట్‌ రిలీజ్ చేయాలంటూ ఏసీబీ కోర్టును మిథున్‌ రెడ్డి ఆశ్రయించిన విషయం విదితమే.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా ఉన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి అయితే, సుమారు 71 రోజుల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి సెప్టెంబర్ 29న ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వారంలో రెండుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని పేర్కొన్న విషయం విదితమే..

Exit mobile version