ఐసీఐసీఐ బ్యాంక్ స్కాంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఏ1గా ఉన్న నరేష్ చంద్రశేఖర్ మిస్సింగ్ పై కేసు నమోదు అయింది. నరేష్ భార్య సరోజినీ ఫిర్యాదు మేరకు 2 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేశారు పటమట పోలీసులు. గత నెల 26న హైదరాబాద్ వెళ్ళాడని.. 28న ఫోన్ చేసి డబ్బులు రావల్సిన పని అవటం లేదని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు భార్య ఫిర్యాదు చేసింది. కాగా.. నరేష్ దేశం వదిలి వెళ్లినట్టు సీఐడీ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ వెళ్లిన నరేష్ ఆచూకీ కోసం సీఐడీ గాలిస్తుంది. అలాగే.. మిస్సింగ్ కేసుపై బెజవాడ పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Viral Video: షోరూం ముందే కాలిపోయిన ఓలా స్కూటర్..
గత పదిరోజుల క్రితం పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన మూడు శాఖల్లో సుమారు రూ.28 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నేర పరిశోధన విభాగం (సీఐడీ) దీనిపై దర్యాప్తు చేపట్టింది. చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించి.. అక్రమాలకు పాల్పడిన ఖాతాదారుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. కీలక సూత్రధారి అయిన బ్యాంక్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అప్పటి నుంచి నరేష్ ఆచూకీ లేదు.
Read Also: J-K Terror Attacks: జమ్మూలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఆర్మీ కొత్త వ్యూహం..