NTV Telugu Site icon

Animal Smuggling : బెజవాడ కేంద్రంగా వైల్డ్ లైఫ్ యానిమల్ స్మగ్లింగ్..

Wild Life Smaguled

Wild Life Smaguled

Animal Smuggling : సముద్రగర్భంలో నివసించే సీ ఫ్యాన్స్ ను దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో నెలరోజులు పరిశీలన జరిపి నిందితుడు శ్రీనివాస్ ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం దేశంలో మొదటిసారని చెబుతున్న పోలీసు అధికారులు. దాదాపు 900 సీ ఫ్యాన్స్ సీజ్చేసారు అధికారులు. నిందితుడు శ్రీనివాస్ ఒక్కొక్కటి ఫొటో ఫ్రేముల్లో పెట్టి లక్షల్లో అమ్మకాలు చేసినట్లుగా అధికారుల ఇన్వెస్టిగేషన్ లో వెల్లడయ్యాయి. లక్ష్మీ కటాక్షం, పెళ్ళి కావటం, పిల్లలు పుట్టడం, భార్యభర్తలు కలిసి ఉండాలంటే ఇవి ఇంట్లో ఉంటే మంచిదంటూ యూట్యూబ్ ద్వారా విస్తృత ప్రచారం చేసాడు నిందితుడు శ్రీనివాస్. యూట్యూబ్ లో వీటి అమ్మకాలు చూసి స్వయంగా రంగంలోకి వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ దిగింది.

Bihar News : బీహార్‌లో కుప్పకూలిన మరో వంతెన.. మోతిహారిలో రూ.కోట్లు నీళ్లపాలు.. వారంలోనే మూడోది

జింక చర్మాలు, అడవి నక్క తోకలు, ముళ్ళ పంది ముళ్లు, పాము కుసుములు వంటి కోటి విలువైన వాటిని అధికారులు సీజ్ చేసారు. తెలంగాణ లోని వరంగల్ కు చెందిన శ్రీనివాస్ వెనుక స్మగ్లింగ్ ముఠా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. బెజవాడలో అక్షయ నిధి మార్ట్ పేరుతో ఏడాదిగా అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మేడారం జాతరలో ఇవి కొన్నట్టు అధికారులకు శ్రీనివాస్ తెలిపాడు. సముద్ర గర్భంలో ఎకో సిస్టం సరిచేసే సీ ఫ్యాన్స్ ను బయటకు తేవటమే అత్యంత క్లిష్టమని అధికారులు తెలిపారు. అంతరించిపోతున్న వైల్డ్ లైఫ్ ప్రాణుల జాబితాలో ఉన్న సీ ఫ్యాన్స్ కూడా ఒకటి.

Israel Hamas War : ఇజ్రాయెల్‌లో తుపాకీలకు పెరిగిన డిమాండ్… 42వేల మంది మహిళలు దరఖాస్తు

చూడటానికి చెట్టు మాదిరిగా ఉండే ఈ సీ ఫ్యాన్స్ ప్రాణముండి సముద్రంలో 20 మీటర్ల లోతులో జీవిస్తాయని అధికారులు తెలిపారు. శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రెండు వారాలు రిమాండ్ విధించింది న్యాయస్థానం.