NTV Telugu Site icon

Navaratri 5th Day: శరన్నవరాత్రులు… మహాచండీగా దుర్గమ్మ దర్శనం..

Navaratri 5th Day

Navaratri 5th Day

Navaratri 5th Day: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. ఇక, 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇంతకీ ఈ అలంకాం ప్రత్యేకత ఏంటి? ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా అలంకరించారంటే..? అనే విషయాల్లోకి వెళ్తే.. ఆదిపరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి అయిన బెజవాడ కనకదుర్గమ్మ పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు ఐదవరోజుకు చేరాయి. అందులో భాగంగా నేడు మహచండీ రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది.. చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు.. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే అంటున్నారు పండింతులు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం ఏ కోర్కెలకోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయనేది విశ్వాసం.

Read Also: Israel Hamas War: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై నేటికి ఏడాది.. కొనసాగుతున్న బాంబుల వర్షం

ఇక, ప్రతి ఏటా ఐదవరోజున స్వర్ణకవచాలంకృత దుర్గ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితేగత ఏడాది నుంచి చండి అలంకారానికి మార్చింది వైదిక కమిటీ. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. గత ఏడాది అధిక శ్రవణం, తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావటంతో అమ్మవారి అలంకారాల్లో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందంటున్నారు పండితులు. పైగా ఈ మధ్యకాలంలో ఇంద్రకీలాద్రిపై నిత్యం చండీహోమాలు జరుగుతుండటంతో.. అమ్మవారికి చండీ అలంకారం వేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయించారు. నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే రెండు లక్షల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక రేపు ప్రత్యేక అలంకారం కావడంతో భారీస్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.