మొన్న హైదరాబాద్ (Hyderabad Dogs Incident),ఇప్పుడు విజయవాడ.. ప్రాంతం ఏదైనా వీధికుక్కల దాడి ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో వీధి కుక్కల దాడి ఘటనపై నగర మేయర్ సమీక్ష నిర్వహించారు. విఎంసి కార్యాలయంలో నగర కమీషనర్ తో సమీక్ష సమావేశం జరిగింది. నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బ్లూక్రాస్ సంస్ధ కోర్టులకు వెళ్తుంది. యానిమల్ యాక్ట్ కు లోబడి చర్యలు తీసుకోవాలి. విజయవాడ నగరంలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నాం అన్నారు. వీధి కుక్కలకు భయపడి పిల్లలు బయటకు రాకుండా స్వేచ్ఛ కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు మేయర్ భాగ్యలక్ష్మి. విజయవాడ భవానిపురం ఘటన చాలా బాధాకరం అన్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ వీధికుక్కలు విజయవాడలో రెచ్చిపోయాయి. భవానీపురంలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న ముగ్గురు చిన్నారులపై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.
Read Also: Electricity Demand : తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
స్థానికులు రాడ్డుతో కుక్కలను తరిమేయడంతో ప్రమాదం తప్పింది. కుక్కల దాడిలో నజీర్, చైతన్య కుమార్, జెస్సిక అనే ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. ఇప్పటికే హైదరాబాద్ ఘటనతో వీఎంసీ అప్రమత్తంకాగా.. తాజాగా నగరంలో కుక్కలు పిల్లలపై దాడి చేయడం ఆందోళన పెంచుతోంది. వెంటనే వీఎంసీ బృందాలు కుక్కలను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. కుక్కల్ని నియంత్రించాలని నగర వాసులు కోరుతున్నారు. హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ ప్రాణాలు కోల్సోయాడు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటన మరిచిపోకముందే హైదరాబాద్‌తో పాటూ పలు జిల్లాల్లో కుక్కలు దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Governor Tamilisai : ప్రీతి ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్.. కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీకి లేఖ
