NTV Telugu Site icon

విజయవాడకి డ్రగ్స్‌కి ఎలాంటి సంబంధం లేదు : సీపీ బత్తిన శ్రీనివాసులు

vijayawada cp

విజయవాడ కేంద్రంగా ఏపీలో డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు స్పందించారు. నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఎన్ ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణపై నిఘా పెట్టామని, విజయవాడకి డ్రగ్స్‌కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇక్కడ అడ్రస్‌ని మాత్రం 2 సార్లు ఉపయోగించారని, డ్రగ్స్‌ రాకెట్ అంత ఢిల్లీ కేంద్రంగా జరిగిందని ఆయన వెల్లడించారు. యాక్టివుగా ఉన్న 18 మంది రౌడీ షీటర్లను బహిష్కరించామని, కొత్తగా 116 మందిపై షీట్లు తెరిచి, తరచుగా కౌన్సిలింగ్ చేస్తున్నామన్నారు. 3 వేల మందిపై సస్పెక్ట్ షీట్లు పెట్టి అరెస్ట్ చేసి మండల మెజిస్ట్రేట్ ముందు పెట్టామని, 14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మందిని అరెస్ట్ చేశామన్నారు.

Read Also : వీడియో : స్కూటీపై టపాసులు తీసుకెళ్లుండగా పేలుడు.. తండ్రికొడుకులు దుర్మరణం..

అంతేకాకుండా రూ. 6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకుని 570 మంది పై చర్యలు తీసుకున్నామని, 570 మంది గంజాయి వాడకం దార్లును గుర్తించి మార్పు కోసం కౌన్సిలింగ్ చేసి మార్పు తెచ్చామని తెలిపారు. కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, కొండపల్లి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు, కొండపల్లి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని ఆయన కోరారు.