విజయవాడలో సంచలనం కలిగించిన బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మూడు ఏళ్ల బాలికను మహిళా కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. కేసు దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. డబ్బుల కోసం పాపను అమ్మకానికి పెట్టింది విజయవాడకు చెందిన లక్ష్మి, పాప తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్ కు పన్నాగం పన్నింది.
గుడివాడకు చెందిన విజయలక్ష్మి అనే ఆమెకు 25 వేలకు పాపను తీసుకుని వెళ్ళమని ఒప్పందం కుదుర్చుకుంది. ఆడుకుంటున్న పాపను పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేశారు కిలాడీ కిడ్నాపర్లు, లక్ష్మితో కుదుర్చుకున్న ఒప్పందంతో విజయలక్ష్మి, పద్మ అను ఇద్దరు కలిసి పాపను అమ్మకానికి పెట్టారు. 2 లక్షలకు పాపను అమ్మేందుకు ప్రయత్నించారు. పాప ను కొన్నవారికి అప్పగించే క్రమంలో ఇబ్రహీంపట్నం వద్ద పాపతో సహా కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 8న విజయవాడ రైల్వే స్టేషన్ లో పదో నెంబర్ ప్లాట్ ఫామ్ పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు విజయవాడకు చెందిన మహిళను రెండో పెళ్ళి చేసుకున్నాడు. వారికి షఫీదా అనే పాప ఉంది. ఆంజనేయులు అక్కడే కూలి పని చేస్తుంటాడు. అతడి భార్య చిత్తు కాగితాలు ఏరుతుంటుంది. ఇద్దరూ కలిసి రైల్వేస్టేషన్‌లో ఉంటున్నారు.సాయంత్రం ఆరు గంటల సమయంలో నిద్రపోతున్న పాప దగ్గరికి వచ్చిన ఇద్దరు మహిళలు చాక్లెట్స్ ఇస్తామని స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. నిద్రనుంచి మేల్కొన్న తల్లిదండ్రులకు పాప కనిపించకపోవడంతో అంతా వెదికారు. జీఆర్పీ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగారు పోలీసులు. సీసీ టీవీ ఆధారంగా దర్యాప్తు జరిపి కిడ్నాపర్ల ఆట కట్టించారు.
Green India Challenge 5: 16న ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్