Site icon NTV Telugu

అరెస్ట్ అయింది వైసీపీ ఎంపీ… మరి విపక్షాలకు ఏం సంబంధం !

ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ తరుణంలో టిడిపిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “అరెస్టైంది అధికార పార్టీ ఎంపీ. మరి విపక్షాలు, పచ్చ మీడియా వాళ్లు గింజుకుంటున్నారేంటి? వారి శోకాలు చూస్తే అసలు గుట్టు బయటపడేలా ఉంది. అచ్చెం, ధూళిపాళ్ల, కొల్లు అరెస్టైనప్పుడు కూడా టీడీపీలో ఈ ఏడుపులు, పెడబొబ్బలు లేవే. అంతగా పెనవేసుకుపోయాడా ఈ ఖైదీ 3468? అద్దె మైకులిచ్చింది మీరేనా? జగన్ గారిని అప్రతిష్ట పాలు చేయడానికి ఎల్లోమీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు బాగా తెలిసిన విద్య. కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు పన్నుతున్నారు.” అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్ లో వైసీపీ సర్కార్ పై ప్రశంసలు కురిపించారు. “కొందరు శవాలతోనూ వ్యాపారాలు, రాజకీయాలు చేస్తున్నారు. పుట్టెడు దుఖంలో ఉన్న వారిని మరింత కష్ట పెడుతున్నారు. అందుకే జగన్ గారి ప్రభుత్వం అంత్యక్రియల కోసం15 వేలు సాయం చేయాలని నిర్ణయించింది. కోవిడ్ తో ఎవరైనా మరణిస్తే ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షమే.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version