Site icon NTV Telugu

వచ్చే మహానాడు వరకు టిడిపి క్లోజ్.. భ్రమల నుంచి బయటపడు బాబు !

టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పిల్లి శాపాలకు ఎవరు భయపడబోరని చరకలు అంటించారు విజయసాయిరెడ్డి. వచ్చే మహానాడు వరకు టిడిపి పార్టీ ఉంటుందో లేదో చూసుకోవాలని చంద్రబాబు సూచనలు చేశారు. “పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబూ. 2024 ఎన్నికల గురించి ఇప్పుడే జోస్యాలు చెబ్తున్నావు. వచ్చే మహానాడు వరకు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో. మూడేళ్ల తర్వాత జగన్ గారి వెంట ఎవరూ మిగలరని శోకాలు పెడుతున్నావు. అచ్చెన్నతో సహా సీనియర్లందరికి భవిష్యత్తు అర్థమవుతోంది. భ్రమల నుంచి బయటపడు. ‘యూటర్నుల’ బాబు ప్రత్యేక హోదా కోసం నిస్సిగ్గుగా మళ్లీ తీర్మానం చేయించాడు. అప్పట్లో ప్యాకేజే ముద్దు అని కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. నా దగ్గర చిప్ప మాత్రమే ఉంది. డబ్బు ఉంటే నీకో లక్ష ఇచ్చే వాడిని అనే తుపాకి రాముడి కామెడీ గుర్తొస్తోంది.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version