Site icon NTV Telugu

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన ట్వీట్‌…!

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గెజిట్‌ విడుదల చేయడంతో… చంద్రబాబు బాగా నిరాశ పడ్డాడని ఎద్దేవా చేశారు. ”కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు పగలు తిట్టుకుని రాత్రి ఫోన్లో పరామర్శించుకుంటారని చంద్రం ఫ్రంట్ పేజీలో ఘోషిస్తున్నాడు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసేది ఎవరు? ఢిల్లీలో అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నదెవరు? నీ సొంత అనుభవాలను ఇతరులకు ఆపాదిస్తే ఎలా? కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో బాగా నిరాశ పడింది ఎవరంటే చంద్రబాబే. జగడం ముదిరి మంటలు చెలరేగాలని తన వంతు ప్రయత్నం చేశాడు. జగన్ గారి లేఖలపై కేంద్రం తక్షణం స్పందించి గెజిట్ విడుదల చేయడంతో ఢీలా పడ్డాడు. శుభం పలకరా పెళ్లి కొడకా…అన్న సామెతలా ఉంది బాబు తీరు.” అంటూ చురకలు అంటించారు.

read also : తెలకపల్లి రవి : కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి నోటిఫికేషన్‌ లాభనష్టాల మధనం

ఇక అంతకు ముందు ట్వీట్‌ లో ”నీరు-చెట్టు పథకాన్ని ‘తేనీరు-అట్టు’ స్కీంలా మార్చి నిధులను అడ్డగోలుగా నాకేశారు పచ్చ నేతలు. చంద్రం జమానాలోని అతి పెద్ద స్కాంలలో ఇదొకటి. 25 లక్షలు ఖర్చయ్యే ఫైబర్ చెక్ డ్యాంకు రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. కాంక్రీట్‌తో కట్టినదే కొట్టుకుపోతుంటే ఫైబర్ మెటీరియల్ ఆగుతుందా?” అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Exit mobile version