Site icon NTV Telugu

14 ఏళ్లు సిఎంగా ఉండి పొడిచింది ఏముంది?

టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సిఎంగా ఉండి చంద్రబాబు పొడిచింది ఏముంది? అని మండిపడ్డారు. “ఈ ‘వారం రోజుల సిఎం కుర్చీ’ పగటి కల ఏంటి చంద్రబాబు? జనం నవ్వుకుంటారన్న ఇంగితం కూడా లేదు. 14 ఏళ్లు సిఎంగా ఉండి పొడిచింది ఏముంది? ఏ స్కీమ్ వల్లనైనా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలవా? ప్రజలను దోచుకున్నందుకేగా నీకు సున్నం బొట్లు పెట్టి ఇంటికి పంపించింది.” అంటూ ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్ లో “కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్‌- ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిలా నిలుస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ కింద చేర్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందిస్తున్నారు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version