Site icon NTV Telugu

Vijaya Sai Reddy: ఎంపీ రఘురామపై సెటైర్లు.. నీ పదవి కూడా నీ విగ్గులాంటిదే

Vijayasai Reddy

Vijayasai Reddy

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వరుస ట్వీట్ల ద్వారా విమర్శల వర్షం కురిపించారు. ‘ఢిల్లీలో కూర్చొని జోస్యాలు చెప్పే నర్సాపురం నక్కకి సిగ్గుంటే రాజీనామా చేసి గెలవాలి. నాలుగు పచ్చ కుల ఛానళ్ల మైకులు ముందు పెట్టుకుని మొరగడం కాదు. నియోజకవర్గంలో తిరిగితే విగ్గు రాజాకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అంతటితో ఆగకుండా ‘బూజు లాంటి రాజు.. ఓ పెగ్గు రాజు.. నీ పదవీ నీ విగ్గులాంటిదే.. తీసేస్తే మిగిలేది గుండే’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. మరోవైపు ‘అడగకుండానే నియోజకవర్గం వదలి అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసే ఏకైక రాజు.. విగ్గురాజు, పెగ్గురాజు’ అంటూ ఇంకో ట్వీట్ చేసి విమర్శలు చేశారు. ‘ఒరేయ్ డూప్లికేట్ గాజు…నీ మీసాలైనా ఒరిజినలేనా లేక పీకి అంటించుకున్నావా? వాటిని మెలి తిప్పడం ఎందుకురా?’ అంటూ మరో ట్వీట్ ద్వారా రఘురామపై సెటైర్లు వేశారు. ‘ఎల్లో కుల మీడియా రుచి కమ్మగా….స్వంత పార్టీ రుచి చేదుగా….నీదేం నోరురా విగ్గుబాబు’ అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా ఇటీవల రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేయాలంటూ వైసీపీ ఎంపీలు దాఖలు చేసిన పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తిరస్కరించిన విషయం తెలిసిందే.

 

Exit mobile version