NTV Telugu Site icon

Vijaya Sai Reddy: అచ్చెన్న.. ఆల్రెడీ టీడీపీ ఆఫీసులకు తాళాలు పడ్డాయి

Vijayasai Reddy

Vijayasai Reddy

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని సవాల్ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చె్న్నాయుడికి వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘పార్టీ లేదు బొక్కా లేదన్న మీ మాటల దెబ్బకు ఆల్రెడీ టీడీపీ ఆఫీసుకి తాళాలు పడ్డాయి అచ్చన్న.. తోలు మందం వల్ల మీకు తెలియడం లేదు.. రెఫరెండం కోరాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లొచ్చుగా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అటు టీడీపీ జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్‌ రావడంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి నారా లోకేష్‌కు కూడా విజయసాయిరెడ్డి కౌంటర్లు ఇచ్చారు. ‘జూమ్‌లోకి వస్తే మ్యూట్ చేసి పారిపోయావ్.. నేరుగా రమ్మని సవాల్ విసిరావే.. డైరెక్టుగా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్నపిల్లలతో రాజకీయం చేయడం కాదు.. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా’ అంటూ ఎద్దేవా చేశారు. ‘టెన్త్ ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏంటి పప్పూ..జూలై 6-15 మధ్య మళ్లీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టడం ఏం కావట్లేదే అనే శాడిస్ట్ బుద్ధి కనిపిస్తోంది.. జూమ్ కాస్తా రసాభసై మధ్యలోనే పారిపోయావుగా’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

Show comments