NTV Telugu Site icon

హిందూపురంలో విజిలెన్స్ దాడులు

పవర్లూమ్స్ హ్యాండ్లూమ్స్ మగ్గాల యజమానులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అనంతపురంలో దాడులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ దాడులు తూతూమంత్రంగా జరిగాయంటున్నారు. మగ్గాల యజమానులతో కుమ్మక్కై ఎలాంటి కేసు నమోదు చేయకుండా మూడురోజులపాటు విజిలెన్స్ దాడులు నిర్వహించారు.

ఇలాంటి దాడులతో ఒరిగేదేం లేదంటున్నారు. మూడునాళ్ళ ముచ్చట అనే రీతిగా వ్యవహరించిన తీరు అనంతపురం జిల్లా హిందూపురం లో జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురం పవర్లూమ్స్ యూనిట్ల పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హిందూపురంతో పాటు పరిసర ప్రాంతాలలో మూడు రోజులపాటు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

సోమందేపల్లి లో నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న ఒక పవర్లూమ్ యజమానిపై కేసు నమోదు చేశారు. లేపాక్షి హిందూపురం మండలంలోని పవర్లూమ్స్ తనిఖీ నిర్వహించగా నిబంధనలకు లోబడే నడుపుతున్నట్టు తనిఖీల్లో తేలిందని అధికారి విశ్వభూషణ్ తెలిపారు. సోమందేపల్లి లో ఒక కేసు మినహా ఎక్కడా కేసు నమోదు కాలేదని తెలిపారు.