NTV Telugu Site icon

పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే చర్చలకు పిలవాలి: విద్యాసాగర్‌రావు

ఏపీలో పీఆర్సీ అంశం ఇప్పట్లో తేలేలాలేదు. పలుమార్లు ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన ఉద్యోగులకు, ప్రభుత్వానికి పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే చర్చలకు పిలవాలని ఏపీ ఏన్జీవో నేత విద్యాసాగర్‌ రావు అన్నారు. ఆదివారం విజయవాడలోని ఎన్జీవో హోంలో సమావేశమైన పలు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.

Read Also: వంతెనను పేల్చేసిన మావోలు

ఈ సందర్భంగా విద్యాసాగర్‌ రావు మాట్లాడారు. 13 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు పెరగలేదు..ఆ విషయం ప్రజలు గమనించాలని కోరారు.ఉద్యోగులకు కొత్త జీవోలతో తీవ్రమైన నష్టం కలుగుతుం దన్నారు. ప్రభుత్వం ఐదేళ్ల పీర్సీని పదేళ్లకు తీసుకెళ్లిందని ఆరోపించారు. మా ఇబ్బందులను పరిష్కరించాల్సిన బాధ్యత‌ ప్రభుత్వానిదే.. ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలన్నారు. ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని ఇప్పటికే చేప్పేశారని విద్యాసాగర్‌ రావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు.