NTV Telugu Site icon

Vidadala Rajini: ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ..

Vidadala Rajini

Vidadala Rajini

ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి విడదల రజనీ… సచివాలయంలో తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేశారు.. తన పిల్లలతో కలిసి సచివాలయానికి వచ్చిన ఆమె వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోందని.. ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయని వెల్లడించారు.

Read Also: Harish Rao: ఆస్పత్రుల నిర్వహణలో రాష్ట్రానికి మూడో స్థానం..

ఇక, రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని.. ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి విడదల రజనీ.. వచ్చే నెలాఖరులోపు అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి.. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు పాలసీ ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సమకూరుస్తున్నాం.. టెలీ మెడిసిన్ సర్వీసెస్.. హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. పేదలకు వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్కడా రాజీ పడడం లేదని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్య సేవలందిస్తున్నాం.. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రూపొందిస్తున్నామని తెలిపారు మంత్రి విడదల రజనీ.