Site icon NTV Telugu

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి..

కడప జిల్లా : ఎట్టకేలకు బ్రహ్మంగారి పీఠాధిపతి వివాదం ముగిసింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి నియామకం అయ్యారు. దీంతో బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులంతా రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చారు. పీఠం చిక్కుముడి వీడటంతో బ్రహ్మంగారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

read also : హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. తెలంగాణలో మూడు రోజుల పాటు!

పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి, ఉత్తరాధికారిగా రెండో కుమారుడు వీరభద్రయ్య నియామకం అయ్యారు. వీరి తదనంతరం పీఠాధిపతిగా రెండో భార్య మారుతి మహాలక్ష్మి కుమారులకు అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే మంచి ముహుర్తాన బ్రహ్మంగారి పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామికి పట్టాభిషేకం జరుగనుంది. కాగా.. గత కొన్ని రోజులుగా బ్రహ్మంగారి పీఠాధిపతి నియామకంపై గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.

Exit mobile version