Site icon NTV Telugu

చంద్రబాబుపై వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు : నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది

టిడిపి అధినేత చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో చంద్రబాబుకు చిప్పకూడు ఖాయమని..చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని..చంద్రబాబు నాయుడి, అచ్చెం నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పాలడెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని… సంగం డైరీ ఎవడబ్బ సొత్తు అని ధూళిపాళ్ళ తన జేబు సంస్థగా మార్చుకున్నాడని నిప్పులు చెరిగారు. అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల రక్తం తాగిన దుర్మార్గులు గత టిడిపి నాయకులని… గత తెలుగుదేశం పార్టీలో నాయకులు దోచుకున్న సొమ్ము ప్రజలకు అప్పగించడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు.

Exit mobile version