Site icon NTV Telugu

బుద్ధా వెంకన్న, బోండా ఉమ మొదటి సారి జీవితంలో నిజం మాట్లాడారు

vellampally srinivas

ఇవాళ విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీ, జనసేన, సీపీఐ అందరూ చంద్రబాబు దొంగల ముఠా అని… బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ మొదటి సారి జీవితంలో నిజం మాట్లాడారని నిప్పులు చెరిగారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికే చోటు ఉంటుందని వాస్తవం చెప్పారని.. కానీ సాయంత్రానికి ప్యాకేజీ తీసుకుని గళం మార్చారని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టాలనుకుంటున్నారా? వాళ్ళు గందరగోళంలో ఉన్నారా? అని నిలదీశారు.

కళ్ళు ఉండి చూడలేని కబోదులు టీడీపీ నేతలని… ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు ఓట్లు అడగటానికి విజయవాడ వస్తున్నాడు? అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్‌ అయ్యారు. విజయవాడ, గుంటూరు మేయర్ అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గమేనని.. ఐదేళ్లు ఉన్నా దుర్గ గుడి ఫ్లైఓవర్ కూడా కట్టలేక పోయిన అసమర్థుడు చంద్రబాబు అని ఫైర్‌ అయ్యారు. కుప్పంలోనే చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారని.. ఒక ఎంపీనే కట్టడి చేయలేని దుస్థితి చంద్రబాబుదని తెలిపారు. విజయవాడ మేయర్ పదవిని వైసీపీ కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version