Site icon NTV Telugu

Vasireddy Padma: బోండా ఉమ చీడపురుగు.. ఆయనకు చెప్పుదెబ్బలు గ్యారంటీ

Vasi Reddy Padma

Vasi Reddy Padma

టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. తనకు పబ్లిసిటీ పిచ్చి అని బోండా ఉమ ఆరోపణలు చేస్తున్నాడని.. మూడేళ్లుగా మహిళా కమిషన్ తరఫున పనిచేస్తున్నా ఏ రోజు కూడా పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నానని.. కాదు ఆయన చిల్లర రౌడీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న కాలకేయుడు అని.. ఓ చీడపురుగు అని ఆరోపించారు. బోండా ఉమా రాజకీయంలో చంద్రబాబు పావు అయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు.

సాదాసీదాగా పోయే చంద్రబాబు పరామర్శను బోండా ఉమానే ఓవరాక్షన్ చేసి తనకు పబ్లిసిటీ కల్పించారని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో తనపై టీడీపీ నేతలు చేసిన దాడి అంశాన్ని వ్యక్తిగత దాడిగా పరిగణనలోకి తీసుకోలేదని వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళా కమిషన్‌పై దాడిగానే తీసుకున్నానని స్పష్టం చేశారు. మహిళా నాయకులు, బాధితులపై ఎలా వ్యవహరించాలో టీడీపీ నేతలకు క్లాస్ తీసుకుందాం అనుకున్నానని తెలిపారు. తాను తలచుకుంటే హైకోర్టులో ప్రైవేటు కేసు వేయలేనా అని ప్రశ్నించారు. బాధ్యత లేకుండా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని… ఇష్టానుసారం మాట్లాడితే ఆయనకు చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. బోండా ఉమాకు ముందుంది ముసళ్ల పండగ అని..ఆయనకు మహిళలే తగిన బుద్ధి చెప్తారన్నారు.

Bonda Uma: వాసిరెడ్డి పద్మ మమ్మల్ని ఒరేయ్ అంటే.. మేం ఒసేయ్ అనలేమా?

Exit mobile version