Site icon NTV Telugu

వినోద్ జైన్‌కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే సూసైడ్‌ నోట్‌ రాసింది: వాసిరెడ్డి పద్మ

ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్య చేసుకుంది, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన వినోద్‌ జైన్‌ గురించి ఎందుకు చెప్పలేకపోయిందో ఆ చిన్నారి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి ఎవరికైనా చెబితే ఇంట్లో వాళ్లని ఏమైనా చేస్తామని భయపెట్టాడా..? వినోద్ జైన్ మందబలం చూసి భయపడిందా..? వినోద్ జైన్ కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే వివరంగా సూసైడ్ నోట్ రాసిందని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Read Also: టీడీపీకి నాయకుల మీద కంట్రోల్ లేదు: వాసిరెడ్డిపద్మ

ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదని ఆ చిన్నారి భావించి ఉండొచ్చు అని పద్మ పేర్కొన్నారు. టిక్కెట్లు ఇచ్చే ముందే టీడీపీ ఆలోచించుకోవాల్సిందని పద్మ అన్నారు. కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ తెరమీదకు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. అంతా జరిగాక పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే సరిపోతుందా అంటూ టీడీపీని దుయ్యబట్టారు. వినోద్‌ జైన్‌కు ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Exit mobile version