Site icon NTV Telugu

Vangalapudi Anitha: జగన్ ట్వీట్‌పై టీడీపీ నేత సెటైర్లు

Vangalapudi Anitha

Vangalapudi Anitha

మూడు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు జగన్ పెట్టిన వైసీపీ పార్టీ చరిత్ర సృష్టించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 స్థానాలను కైవసం చేసుకొని కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు మెజారిటీతో ఏపీ లో అధికారాన్ని చేపట్టింది. అయితే జగన్ అధికారం చేపట్టి నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్బంగా సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ నేత సెటైర్లు ...

సీఎం జగన్ పరిపాలనపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. తిప్పి కొడితే మూడేళ్లు కాలేదు. జగన్ సభలు పెడితే జనాలు రావడంలేదు. వచ్చిన ఉండటంలేదు. చివరికి ఖాళీ కుర్చీలే ఉపన్యాసాలు వింటున్నాయి. చేసేదేమిలేక రికార్డింగ్ డాన్సులు చూపించి జనాన్ని కుర్చోపెడుదాం అన్న స్థాయికి దిగజారిపోయారు. చూపించుకోవడానికే చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే కదా ?మూడేళ్ల పాలన సుపరిపాలన అయితే మీకు ఈ కర్మ ఎందుకు పడుతుంది? అని  అనిత ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్విట్టర్ లో తెగ హల్చల్ చేస్తుంది.

Exit mobile version