NTV Telugu Site icon

Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్..

Vallaabneni

Vallaabneni

Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం తిరిగి వస్తుండగా వాహనాన్ని వెంబడించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశీ ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ17గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 21 మందిని అరెస్ట్ చేశారు.