NTV Telugu Site icon

గుడ్ న్యూస్‌: పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ అంగీకారం…

కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ ఏపీ ప్ర‌భుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది.  పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఆమోదం తెలిపింది.  రూ.47,725 కోట్ల రూపాయ‌లకు పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌ను స‌వ‌రించారు.  ఈ అంచ‌నాల‌ను అంగీక‌రిస్తున్న‌ట్టు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ తెలిపారు.  స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను రేపు ఆర్ధిక శాఖ‌ల‌కు పంపించ‌నున్నారు. పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌లు పై వ‌చ్చేవారం కేంద్ర కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పోల‌వ‌రం ప్రాజెక్టును ఈ ఏడాది జూన్ నెల వ‌ర‌కు పూర్తి చేయాల‌ని ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యించినా క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా ఆల‌స్యం అయింది.  పైగా వ్య‌యం పెరిగిపోవ‌డంతో ప్రాజెక్టు అంచ‌నాల్లో మార్పులు చేసి కేంద్రం ముందుకు తీసుకెళ్ళారు.  కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఇప్పుడు ఆ అంచ‌నాల‌కు ఆమోదం తెల‌ప‌డంతో ప‌నులు వేగంగా జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ : అమెరికా కంటే ఒక రోజు ముందుగానే ఇండియాలో!