ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌తో పనిచేస్తున్నారు.. దీంతో, ప్రపంచవ్యాప్తంగా భారత్ దూసుకుపోతోందన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్… కాకినాడలో జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌తో కలిసి ప్రారంభించారు పీయూష్ గోయల్.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, వంగా గీతా పాల్గొన్నారు.. ప్రస్తుతం జేఎన్టీయూలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు.. సౌత్ ఇండియాలో తొలి ఐఐఎఫ్టీ క్యాంపస్ కాకినాడలో ఏర్పాటు కావడంపై అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. దక్షణ భారతదేశంలో తొలి ఐఐఎఫ్ టీ కాకినాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ బలం వ్యవసాయం, మత్స్య సంపద అని పేర్కొన్న ఆయన… మేడిన్ ఇండియాను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..
Read Also: Arvind Kejriwal: దేవుడి ఆశీర్వాదం అవసరం.. ‘గాడ్స్ ఆన్ కరెన్సీ’ డిమాండ్‌పై ప్రధానికి కేజ్రీవాల్ లేఖ