Site icon NTV Telugu

Bhupathi Raju Srinivasa Varma: కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం..

Srinivas Varma

Srinivas Varma

Bhupathi Raju Srinivasa Varma: కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పార్లమెంట్ నుంచి సాయంత్రం తన మంత్రిత్వ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి ప్రయాణిస్తున్న కారును మరో ప్రభుత్వ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయింది. కారు ఇంజన్ సీజ్ అయినట్లు తెలుస్తోంది.

Read Also: Crime News : దారుణం.. మటన్ కూర వండలేదని భార్యను చంపిన భర్త

జాయింట్ సెక్రటరీ వెనువెంటనే మంత్రి గాయాలకు ప్రాథమిక చికిత్స చేవారు. ఈ ప్రమాదంలో మంత్రి వర్మ తలకు, కాలికి గాయాలయ్యాయి. రహదారిపై నుంచి ట్రాఫిక్ పోలీసులు కారుని పక్కకు తొలగించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సొంత నియోజకవర్గం నర్సాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టుతోనే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విజయవాడ బయలుదేరారు.

Exit mobile version