ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి 10 సెంట్రల్ విద్యాసంస్థలు వచ్చాయని… ఏపీకి కేటాయింపులకు ప్రధాని నరేంద్ర మోడీ రెండో ఆలోచన చేయరు, ఉండదని తెలిపారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. కాకినాడలో జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ప్రారంభించిన ఆమె.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మెరైన్ ప్రొడక్ట్‌ను ఎగుమతి చేయడంలో ఏపీ ముందు ఉందని ప్రశంసించారు.. ట్రేడ్ కోర్స్ లు ప్రపంచ వ్యాప్తంగా చాలా అవసరం ఉందన్న ఆమె… కంపెనీలు రన్ చేయడం అంత కష్టమైన పని ఏమీ కాదన్నారు.. అయితే, ఇప్పుడు అంతా కాపీ పేస్ట్ జరుగుతుంది.. అది మాత్రం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు.. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ఇంఛార్జ్ మంత్రి సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలన్నారు.. ఇక, దేశంలో కోల్‌కతా, ఢిల్లీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ఐఐఎఫ్టీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు నిర్మలా సీతారామన్.
Read Also: Bandi Sanjay : యాదగిరిగుట్టకు బండి సంజయ్.. యాదాద్రిలో టెన్షన్.. టెన్షన్