రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియం ప్రతిపాదన ఇప్పుడు కాకరేపుతోంది.. రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటును వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆహ్వానిస్తున్నా.. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్మాణం చేపట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ఈ ప్రతిపాదనలను తప్పుబట్టాయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ఇదే వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం నిర్మాణంపై పలు సలహాలు, సూచనలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు.. ఆర్ట్స్ కాలేజీలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తాను వ్యతిరేకమని లేఖలో స్పష్టం చేసిన ఉండవల్లి.. అయితే, సెంట్రల్ జైలు స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మించాలని సూచించారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియాన్ని వ్యతిరేకిస్తున్న సమయంలో.. వైఎస్ జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.