NTV Telugu Site icon

వైఎస్‌ వివేకా హత్య కేసులో మరో అరెస్ట్..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది.. తాజాగా. ఈ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.. వైఎస్‌ వివేకా కేసులో ఇవాళ ఉదయం నుంచి ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉమాశంకర్‌ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు… దీంతో ఉమాశంకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. ఉమాశంకర్‌రెడ్డి స్వస్థలం.. సింహాద్రిపురం మండలం సుంకేసుల.. వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమా శంకర్‌రెడ్డి అని సీబీఐ అధికారులు వెల్లడించారు. కాగా, వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇప్పటికే సునీల్‌ యాదవ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.