Site icon NTV Telugu

Crime :గణేష్ నిమజ్జనంలో అపశృతి .. ఇద్దరు యువకులు మృతి

Untitled 11

Untitled 11

Kurnool: హిందువులు జరుపుకునే పెద్ద పండగల్లో వినాయక చవితి కూడా ఒకటి. పండగకి నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం కనిపిస్తుంది. చిన్న పెద్ద అంత కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు వినాయక చవితి పండుగ. కానీ పండగ పూట ఆనందాలు నిడాల్సిన వేళా ఆ కుటుంబాల్లో విషాదం నిండిది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా పండగ జరుపుకున్న ఇద్దరు యువకులు దురదృష్ట వశాత్తు వేరు వేరు చోట్ల వేరు వేరు కారణాలతో మరణించారు. వివరాలలోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో పలు చోట్ల గణేష్ నిమర్జనం లో అపశృతి చోటు చేసుకుంది.

Read also:Crime: రోడ్డు పై రెచ్చిపోయిన బాబులు.. భయంతో పరులుగు తీసిన స్థానికులు

కృష్ణగిరి మండలం కోయిలకొండలో వినాయక చవితిని ఎంతో కోలాహలంగా జరుపుకున్నారు. గణేష్ ని నిమర్జనం చేసేముందు ఆనవాయితి ప్రకారం ఊరేగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊరేగింపు ముందు ఎంతో సంతోషంగా డ్యాన్స్ వేస్తున్న మురళీకృష్ణ అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీనితో అతన్ని హాస్పిటల్ కి తరలించగా అతను మార్గం మధ్యలోనే గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు. కర్నూలు జిల్లాలోనే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలం కృష్ణాపురంలో వినాక చవితిని ముగించుకుని పండగలో భాగంగా వినాయకుణ్ణి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వినాయకుణ్ణి నీటిలో నిమర్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు రాజు అనే యువకుడు వినాయకుడితో పాటు నీళ్లలోకి జారిపడి మృతి చెందాడు. కారణం ఏదైనా అర్ధాంతరంగా ఆ యువకులు మరణించడం అందరిని కలిచివేస్తుంది.

Exit mobile version