NTV Telugu Site icon

క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…

ఆంధ్ర‌ప‌దేశ్‌లోని క‌ర్నూలు జిల్లాలో పాత‌క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి.  క‌ర్నూలు జిల్లాలోని గడివేముల మండ‌లంలోని పెస‌ర‌వాయి గ్రామంలో టీడీపీ నేత‌ల‌ను ప్ర‌త్య‌ర్ధులు న‌రికి చంపారు.  అడ్డొచ్చిన అనుచ‌రుల‌పై కూడా దాడులు చేశారు.  పెస‌ర‌వాయి గ్రామానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు గురువారం ఉద‌యం అనుచ‌రుల‌తో క‌లిసి వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్ధులు దాడి చేశారు.  ఈ దాడిలో ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా, ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  గాప‌ప‌డిన ముగ్గురిని నంధ్యాల ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు.  కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  పాతక‌క్ష‌లే కార‌ణమ‌ని పోలీసులు చెబుతున్నారు.