NTV Telugu Site icon

Twins Day Festival: అదరహో అనిపించిన కవలలు

ఇవాళ ట్విన్స్ డే. ఒకే తల్లి కడుపున కవలలుగా జన్మించిన వారంతా కలిసి చేసుకునే అద్భుతమయిన వేడుక అది. సాగరతీరం విశాఖలో కవలలు సందడి చేశారు. విశాఖలో 30కి పైగా కవల జంటలు ఆడి పాడారు. అందరితో సంతోషంగా గడిపారు. ఒకేరూపం మనుషులు మాత్రం ఇద్దరు. అదేదో సినిమాలో చూసినట్టుగా వీరంతా ఒకేచోట కలిసి చేసిన సందడి అదరహో అనిపించింది.

విశాఖ నగరంలోని ఓ హోటల్ లో ట్విన్స్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఏపీ-తెలంగాణ కు చెందిన 31 కవల జంటలు ఇందులో పాల్గొన్నాయి. ఆట పాటలతో సందడి చేశారు ఈ కవలలు. ఈ వేడుకలు చూడడానికి వచ్చినవారికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. వాళ్ళేం చేశారో మీరే చూడండి.

https://youtu.be/mPETAkocphg