NTV Telugu Site icon

Tungabhadra Dam: తెగిపోయిన తుంగభద్ర డ్యాం గేటు.. పోటెత్తిన వరద నీరు..

Thungabadra

Thungabadra

Tungabhadra Dam: కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్‌లో ఉన్న తుంగభద్ర డ్యాం 19వ గేటు ఊడిపోవడంతో భారీగా నీరు బయటికి వెళ్లిపోతుంది. డ్యాంకు ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం (ఆగస్టు10) అర్ధరాత్రి 11 గంటల సమయంలో డ్యామ్‌ గేట్లు మూసేందుకు అధికారులు ట్రై చేశారు. చీకటి కావడంతో గేటు కొట్టుకుపోయిందా లేక అక్కడే పడిపోయిందా తెలుసుకోలేకపోయిన అధికారులు.. చైన్ లింక్ తెగిపోవడంతో పాటు గేటు కనిపించకపోవడాన్ని దృవీకరించారు. దీంతో తుంగభద్ర డ్యామ్ నుంచి ప్రస్తుత ఔట్ ఫ్లో 75 వేల క్యూసెక్కులుగా ఉంది.

Read Also: Bangladesh : మళ్లీ అధికారంలోకి షేక్ హసీనా ? బంగ్లాదేశ్ వీధుల్లోకి అవామీ లీగ్ మద్దతుదారులు

ఇక, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయాన్నే డ్యామ్‌ను కొప్పాల్‌ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి శివరాజ్‌ సందర్శించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌ 33 గేట్ల నుంచి నీరు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి లక్ష వేల క్యూసెక్కుల నీరు బయటికి వెళ్లిపోతుంది. డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Read Also: Devara: తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి.. దేవర -2 దాదాపు లేనట్టే..?

అలాగే, కృష్ణానది వరద ఉధృతి కొనసాగుతుంది. తుంగభద్ర డ్యామ్ చైన్ లింక్ తెగిపోవడంతో గేట్ కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్ నుంచి విడుదల అవుతున్న నీటితో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అత్యవసర సహాయంకోసం టోల్ ఫ్రీ 1070,112, 18004250101 సంప్రదించండి అని చెప్పుకొచ్చారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదు అని వెల్లడించారు.